March 23, 2026 05:26 PM

కష్టకాలంలో తోడుగా నిలిచిన ఫోటోగ్రఫీ కుటుంబం

కష్టకాలంలో తోడుగా నిలిచిన ఫోటోగ్రఫీ కుటుంబం
కష్టకాలంలో తోడుగా నిలిచిన ఫోటోగ్రఫీ కుటుంబం 🤝📸\r\n\r\n👉 అనారోగ్యం, ప్రమాద సమయంలో సహచరులకు అండగా నిలుస్తున్న ఫోటోగ్రాఫర్లు\r\n\r\n📸 ఫోటోగ్రఫీ వృత్తి కేవలం ఉపాధి మాత్రమే కాదు, అది ఒక కుటుంబమని మరోసారి నిరూపితమైంది.\r\n\r\n🤝 కష్టకాలంలో సహచరులకు అండగా నిలుస్తూ ఫోటోగ్రాఫర్లు చూపిన ఐక్యత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.\r\n\r\n🏥 కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఫోటో & వీడియో గ్రాఫర్స్ యూనియన్ సభ్యుడు ఎండి అజీమ్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో యూనియన్ సభ్యులు మానవత్వంతో ముందుకు వచ్చి సహాయం అందించారు. సభ్యుల సహకారంతో సేకరించిన 💰₹21,000/- ఆర్థిక సహాయాన్ని ఆయనకు అందజేసి యూనియన్ తన బాధ్యతను చాటుకుంది. 🤲\r\n\r\nఈ కార్యక్రమంలో \r\nరాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవీందర్ గారు,\r\nకరీంనగర్ టౌన్ ప్రధాన కార్యదర్శి సాయిప్రీతి రమేష్,శంకరపట్నం మండల అధ్యక్షులు చౌడమల్ల సంపత్,ప్రధాన కార్యదర్శి బొంగోని కుమార్,కోశాధికారి మొల్గూరి రమేష్,ఉపాధ్యక్షులు sd.గోరేమియా,మనోచారి,మరియు సభ్యులు పాండ్రాల శ్రీనివాస్,వంగ శ్రీనివాస్,బొజ్జ చంద్రమౌలి,సుద్దాల కుమార్,జినుక కుమార్ తదితరలు పాల్గొన్నారు.\r\n\r\n🚑 అలాగే ఖమ్మం టౌన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ రాము (ID:1043) ఇటీవల జరిగిన యాక్సిడెంట్‌లో ముఖానికి గాయాలు కావడంతో సర్జరీ అవసరమైంది. ఆయన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఖమ్మం జిల్లా ఫోటోగ్రాఫర్ మిత్రులు వెంటనే స్పందించి 💰₹66,000/- ఆర్థిక సహాయాన్ని అందించి సర్జరీ జరగడానికి తోడ్పడ్డారు. ప్రస్తుతం రాము చికిత్స పూర్తి చేసి 🏥 హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.\r\n\r\nఈ కార్యక్రమంలో \r\nజిల్లా ఖమ్మం జిల్లా అధ్యక్షులు వెంకట గారు. కోశాధికారి తిరుపతిరావు గారు, \r\nఖమ్మం జిల్లా గౌరవ సలహాదారులురఘు గారు, \r\nటౌన్ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు \r\nసుధాకర్ రావు గారు \r\nబండారి శేషగిరి గారు,\r\nతిరుపతి రావు గారు\r\nఫోటోగ్రాఫర్ మిత్రులు అందరూ పాల్గొన్నారు...\r\n\r\n🤝 ఈ రెండు ఘటనలు ఫోటోగ్రాఫర్ల మధ్య ఉన్న సహకారం, స్నేహభావం మరియు సేవా మనోభావానికి నిదర్శనంగా నిలిచాయి.\r\n\r\n💙 ఒకరి కష్టాన్ని అందరూ తమ కష్టంగా భావించి సహాయం చేయడం ద్వారా ఫోటోగ్రఫీ సమాజం నిజమైన కుటుంబమని మరోసారి స్పష్టమైంది.\r\n\r\n🙏ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. 🌹\r\n\r\nఇట్లు \r\nతెలంగాణ రాష్ట్ర అసోసియేషన్
Back to Home